TG: జగిత్యాల జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. జిల్లా కేంద్రానికి చెందిన ఓ వృద్ధురాలు.. అనారోగ్యం బారిన పడిన తన భర్తను వారం రోజుల కింద ప్రభుత్వాస్పత్రిలో చేర్పించింది. ఈ క్రమంలో ఆ వృద్ధురాలు సరిగ్గా ఆహారం తినక హైబీపీతో తన భర్తకు కేటాయించిన బెడ్‌పైనే వాలిపోయింది. అయితే ఆమెకు ట్రీట్‌మెంట్ ఇవ్వాల్సింది పోయి.. ఆస్పత్రి సిబ్బంది ఆ వృద్ధురాలిని బయటకు నెట్టేశారు. దీంతో తన భార్య కోసం ఆస్పత్రి బెడ్‌పై నుంచి వృద్ధురాలి భర్త కూడా బయటకు వచ్చేశాడు.