రొంపిచర్ల మండలం అన్నవరం గ్రామం వద్ద ఓ స్కూల్ బస్సును గ్రామస్థులు నిలిపివేశారు. నరసరావుపేటలోని ఓ స్కూల్ బస్ గత నెల 29న యువకుడిని ఢీకొట్టగా కాలు విరిగిపోయింది. అయితే ఈ ఘటనపై బాధితులు రొంపిచర్ల పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ స్కూల్ యాజమాన్యం స్పందించలేదు. దీంతో స్కూల్ బస్సును శుక్రవారం ఆపివేశామని చెప్పారు.