ప్రత్తిపాడు: ఎస్టి కాలనీలో త్రాగునీరు లేక విలవిల

58చూసినవారు
పెదనందిపాడు మండలం నాగులపాడు గ్రామం ఎస్టీ కాలనీలో త్రాగునీరు 3 రోజుల నుంచి రావటం లేదంటూ ప్రతిరోజు 2 కిలోమీటర్ల నడిచి వెళ్లి బిందెలతో తెచ్చుకోవాల్సి వస్తుందని గురువారం మీడియా ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు కాలనీ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సచివాలయ సిబ్బందికి ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని తెలిపారు. అధికారులు స్పందించి త్రాగునీరు అందించాలని ఎస్టీ కాలనీవాసులు కోరారు.

సంబంధిత పోస్ట్