విశాఖలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 14 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. పార్టీ కార్యాలయంలో కండువా కప్పుకొన్నారు. వైసీపీని వీడిన వారిలో సునీత, శ్రీదేవి, విజయసాయి, గోవింద్, హనూక్, రజని, నరసింహపాత్రుడు, రామారావు, సూర్యకుమారి, వరలక్ష్మి, అప్పారావు, అప్పల రత్నం, జానకిరామ్ ఉన్నారు. మరికొందరు కార్పొరేటర్లు జనసేనలో చేరనున్నట్లు సమాచారం.