AP: ఈ నెల 20 నుంచి ఐదు రోజుల పాటు దావోస్‌లో జరిగే సమావేశాల్లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా, పారిశ్రామిక అనుకూల విధానాలను సీఎం చంద్రబాబు వివరిస్తారు. కాగా, 2014-19 మధ్యకాలంలో సీఎంగా ఉన్న సమయంలోనూ చంద్రబాబు వరుసగా దావోస్ పర్యటనకు వెళ్లేవారు. తిరిగి ఇప్పుడు సీఎం అయిన తర్వాత దావోస్ పర్యటనకు వెళ్తున్నారు. ఈ పర్యటన చంద్రబాబు బిగ్ టాస్క్ లాంటిది. దాంతో ఏపీతో జరిగే ఒప్పందాలపై ఆసక్తి నెలకొంది.