AP: తిరుమలలో గతేడాది కల్తీ నెయ్యి వ్యవహారం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. దాంతో నెయ్యిని సూక్ష్మస్థాయిలో పరీక్షించేందుకు అవసరమైన యంత్రాలను ఏర్పాటు చేస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. తాజాగా నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు రూ.70 లక్షల విలువైన 2 పరికరాలను విరాళమిచ్చింది. జర్మనీ నుంచి తిరుమలకు తీసుకొచ్చి ల్యాబులో అమర్చారు. ఈ యంత్రాల సహాయంతో నెయ్యిలో కల్తీని వంద శాతం గుర్తించవచ్చు.