కర్ణాటకలోని బెంగళూరు యెలహంక ప్రాంతంలోని మాంసం ప్రియులకు ప్రభుత్వ అధికారులు షాక్ ఇచ్చారు. వచ్చేనెల యెలహంక ఏరో ఇండియా 15వ ఎడిషన్ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ క్రమంలో ఏరో ఇండియా 15వ ఎడిషన్ జరిగే 13 కిలోమీటర్ల పరిధిలో మాంసం దుకాణాలు క్లోజ్ చేయాల్సిందిగా అధికారులు నిర్ణయించారు. జనవరి 23 నుంచి ఫబ్రవరి 17 వరకు ఆ ప్రాంతంలో దాదాపు నెల రోజుల పాటు మాంసాహారం అమ్మకం పై నిషేధం విధించారు.