సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లిన వారంతా తిరిగి హైదరాబాద్ బాట పట్టారు. దీంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి వాహనదారులతో రద్దీగా మారింది. పెద్ద అంబర్‌పేట్ నుంచి ఎల్బీనగర్ వరకు విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి రద్దీని నియంత్రించే పనిలో నిమగ్నమయ్యారు.