మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి‌పై కేసు నమోదు

53చూసినవారు
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి‌పై కేసు నమోదు
AP: వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది. ఇటీవల టీడీపీ నేతలను వదిలేది లేదంటూ కాకాణి బహిరంగ బెదిరింపులకు పాల్పడ్డారు. అలాగే పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై కావలి వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. 224, 351/2 సెక్షన్ల కింద మాజీ మంత్రిపై FIR ఫైల్ చేశారు.