AP: వైకల్యం మరిచి.. సంకల్ప బలంతో విధిరాతను మార్చవచ్చని ఆ బాలుడు నిరూపించాడు. కోనసీమ జిల్లా రాజోలుకు చెందిన చెల్లుబోయిన బాబి పుట్టుకతోనే దివ్యాంగుడు. అతడికి కుడిచేయి మోచేతి వరకే ఉంది. ఎడమ అరచేయి లేదు. పాఠశాలలో చేర్పించి కాళ్లతో రాసేలా శిక్షణ ఇప్పిద్దామని తల్లిదండ్రులు భావించారు. కానీ విద్యార్థి మాత్రం మోచేతులతోనే రాయడం సాధన చేసి ఫలితం సాధించాడు. తనకు ప్రస్తుతం ఇస్తున్న దివ్యాంగ పింఛన్‌ను పెంచాలని కలెక్టరేట్‌కు వచ్చి తానే స్వయంగా అర్జీ రాశాడు.