అగ్రరాజ్యం అమెరికా వెళ్లి అక్కడే స్థిపరడాలని చాలా మంది కలలు కంటారు. ఈక్రమంలోనే అనేక దేశాలకు చెందిన ప్రజలు అక్కడకు వెళ్లి జీవిస్తుంటారు. వారికి అక్కడి పౌరసత్వం లభించకపోయినా.. అక్కడ వారికి పిల్లలు పుడితే ఆ చిన్నారులకు అమెరికా పౌరసత్వం లభించేది. కానీ ఇప్పుడు ఆ పద్ధతిని రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఈక్రమంలోనే అందుకు సంబంధించిన ఉత్తర్వులపై సంతకాలు చేశారు.