వికసిత్ ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు శ్రీకారం

80చూసినవారు
వికసిత్ ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు శ్రీకారం
ఏపీ అభివృద్ధికి ‘వికసిత్ ఆంధ్రప్రదేశ్’ పేరుతో 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. వికసిత్ భారత్ తరహాలోనే ఇది ఉండనుంది. దాంట్లో భాగస్వామ్యమయ్యేలా 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కాగా, రెండ్రోజుల క్రితం నీతి అయోగ్ వైస్ చైర్మన్‌ సుమన్ బేరీతో సీఎం చంద్రబాబు భేటీ అయి 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనపై చర్చించారు.