భారత్ భూభాగాలను తమ ప్రాంతాలుగా చూపించే కొత్త కరెన్సీ నోట్లను ముద్రించనున్న నేపాల్

85చూసినవారు
భారత్ భూభాగాలను తమ ప్రాంతాలుగా చూపించే కొత్త కరెన్సీ నోట్లను ముద్రించనున్న నేపాల్
నేపాల్ ప్రభుత్వం తాజాగా తమ దేశ మ్యాప్‌లో భారతదేశంలో భాగంగా ఉన్న కొన్ని ప్రాంతాలను తమ దేశ ప్రాంతాలుగా చూపించాలని నిర్ణయించింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ నేపాల్ త్వరలో సవరించిన మ్యాప్‌తో కొత్త బ్యాంక్ నోట్లను ముద్రించడానికి సన్నాహాలు చేస్తోందని సమాచారం. దాని ప్రకారం, కొత్త నోట్లలో లిపులేక్, కాలాపానీ, లింపియాదూర ప్రాంతాలు తమనే అని నేపాల్ చూపించుకోనుంది. కొత్త నోట్ల ముద్రణ ఆరు నెలల నుంచి ఏడాదిలోగా పూర్తవుతుందని సమాచారం.

సంబంధిత పోస్ట్