ఏపీలో మద్యం షాపుల్లో పనిచేస్తున్న సూపర్ వైజర్లు, సేల్స్‌మెన్‌లకు ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్‌తో షాపులు బంద్ చేస్తామని గతంలో ప్రకటించారు. ఈ నెల 7 నుంచి మద్యం షాపుల బంద్ చేపట్టాల్సి ఉంది. అయితే వరదల నేపథ్యంలో బంద్‌ను వాయిదా వేస్తున్నట్లు బేవరేజ్ కార్పొరేషన్ కాంట్రాక్ట్.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం వెల్లడించింది.