1944లో బెంగాల్ రాష్ట్రంలో కరువు వచ్చి, కలకత్తా నగరంలో ఆకలి వల్ల, రోగాల వల్ల ఎందరో చనిపోయారు. 1946లో హిందు, ముస్లిం మత వైషమ్యాలు, విధ్వంసకర సంఘటనలు కలకత్తా నగరాన్ని అల్లకల్లోలం చేశాయి. వీటినిచూసి చలించిపోయిన థెరిసా 1946 సెప్టెంబర్‌లో సంఘసేవకు శ్రీకారం చుట్టారు. మోతీజిల్‌లో పిల్లలకు ఒక స్కూల్ ప్రారంభించి, అక్కడి పేదలకు సేవ చేసారు. బెంగాల్ కరువు రోజుల్లో ఆమె సేవను గుర్తించి, అప్పటి ప్రధాని నెహ్రూ ఎంతగానో ప్రశంసించారు.