పంటపొలాల పై ఏనుగుల దాడి
బైరెడ్డిపల్లి మండలంలోని వెంగంవారిపల్లె పంచాయతీ పరిధిలోని అటవీ సమీప పంట పొలాలపై గజరాజులు దాడులు చేశాయి. మార్కెట్ కు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన రైతు దేవప్పకు చెందిన టమోటాలను ధ్వంసం చేశాయి. సుమారు రూ. లక్ష వరకూ నష్టం వాటిల్లినట్లు రైతు వాపోయాడు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి పంట పొలాలపై ఏనుగులు దాడులు చేయకుండా చర్యలు చేపట్టాలని సమీప పొలాల రైతులు కోరుతున్నారు.