సుమో, లారీ ఢీ.. 14 మందికి గాయాలు
తిరుపతిలోని బంగారుపాళ్యం మండలంలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే అనంతపురానికి చెందిన కొందరు కాణిపాకం దర్శనానికి సుమోలో బయల్దేరారు. ఈ నేపథ్యంలోనే మొగిలి ఘాట్ రోడ్డులో సుమో, ఐచర్ లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 14మందికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.