Nov 02, 2024, 04:11 IST/
నేడో, రేపో BJP ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు!
Nov 02, 2024, 04:11 IST
బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చింది. రెండు, మూడు రోజుల్లో మూడు స్థానాలకు అభ్యర్థులను పార్టీ అధిష్టానం ఖరారు చేయనుంది. ఒక్కో స్థానానికి మూడేసి పేర్లతో జాబితాను రూపొందించి ఢిల్లీలోని జాతీయ ఎన్నికల కమిటీకి పంపించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. శని, ఆదివారాల్లో ఎన్నికలు జరగనున్న మూడు స్థానాలకు ముగ్గురు చొప్పున అభ్యర్థులను ప్రతిపాదిస్తూ కేంద్ర ఎన్నికల కమిటీకి జాబితా పంపించనున్నారు.