Apr 05, 2025, 16:04 IST/హుజురాబాద్
హుజురాబాద్
కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం
Apr 05, 2025, 16:04 IST
శంకరపట్నం మండలం తాడికల్ శివారులో రెండు బైకులు ఢీకొన్నాయి. తాడికల్కి చెందిన రాగుల శ్రీనివాసచారి కరీంనగర్ నుంచి బైక్పై స్వగ్రామానికి వస్తుండగా.. ఎదురుగా వస్తున్న కృష్ణ అనే వ్యక్తి ఢీకొట్టాడు. దీంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 అంబులెన్స్ సిబ్బంది గూడూరు సతీష్ ఇద్దరికీ ప్రథమ చికిత్స అందిస్తూ హుజూరాబాద్ ఆసుపత్రికి తరలించారు.