సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పారదర్శకంగా చేయండి.. శ్రీనివాసులు

1330చూసినవారు
సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పారదర్శకంగా చేయండి.. శ్రీనివాసులు
సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పగడ్బందీగా, పారదర్శకంగా చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం జిల్లా జాయింట్ కలెక్టర్ గుడిపల్లి మండలం బెగ్గిలపల్లి సచివాలయ పరిధిలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. సచివాలయాలలో అందిస్తున్న సేవలను పెంచడంలో భాగంగా రిజిస్ట్రేషన్ సేవలను కూడా ప్రభుత్వం తీసుకొని రావడం జరిగిందన్నారు. ఈ సేవలను పార దర్శకంగా చేపట్టాల న్నారు. ఇప్పటికే 33 సచివాలయాలలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతున్నదన్నారు. ఈ ప్రక్రియలో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా సచివాలయ కార్యదర్శిలు అవసరమైన అవగాహన పెంచుకొని రిజిస్ట్రేషన్ సేవలు అందించాలన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రిజిస్ట్రార్ కే. శ్రీనివాసరావు, కుప్పం సబ్ రిజిస్ట్రార్ వెంకట సుబ్బయ్య, కుప్పం ఆర్డీఓ శివయ్య, గుడిపల్లి తహసిల్దార్ గుర్రప్ప, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :