చిత్తూరు: వైసీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శిగా రజనీకాంత్
వైఎస్ఆర్ సీపీ చిత్తూరు జిల్లా కార్య నిర్వహక కార్యదర్శిగా గుడిపాల మండలంలోని వసంతాపురం సర్పంచ్ ఎన్ ఎస్ రజనీకాంత్ ను ఆ పార్టీ కేంద్ర కమిటీ శనివారం నియమించింది. అలాగే జిల్లా కార్యాచరణ సభ్యుడుగా కృష్ణ మూర్తి రెడ్ది నియమించినట్లు తెలిపారు. ఈ సందర్భముగా పార్టీ నాయకులు రాసనపల్లి ప్రకాష్ , మధు రాయల్, మధుసూదన్ రెడ్డి లతో పాటు పలువురు వారికి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.