Oct 31, 2024, 07:10 IST/
మానవత్వం చాటుకున్న మిర్యాలగూడ కాంగ్రెస్ ఎమ్మెల్యే (వీడియో)
Oct 31, 2024, 07:10 IST
TG: నల్గొండ జిల్లా మిర్యాలగూడ కాంగ్రెస్ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మానవత్వం చాటుకున్నారు. మిర్యాలగూడ తహశీల్దార్ కార్యాలయం వద్ద గురువారం రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు అయ్యాయి. అయితే అదే సమయంలో అటు వైపు నుంచి వెళుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే తన వాహనాన్ని ఆపి.. క్షతగాత్రులను తన వాహనంలో ఆసుపత్రికి తరలించారు. దీంతో ఎమ్మెల్యే చేసిన పనికి పలువురు అభినందిస్తున్నారు.