Nov 19, 2024, 12:11 IST/
తాగుబోతుల సంఘానికి ఏకైక అధ్యక్షుడు కేసీఆర్: CM
Nov 19, 2024, 12:11 IST
తెలంగాణలో తాగుబోతుల సంఘానికి ఏకైక అధ్యక్షుడు కేసీఆర్ అని సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'హాఫ్ కు, ఫుల్ కు అంబాసిడర్ కేసీఆర్. మీరు ఫాంహౌస్ లోనే ఉండండి. వైన్ షాపు అతనికి చెప్తా.. కావల్సినప్పుడల్లా సీసాలు అందిస్తడు. రాష్ట్రాన్ని కేసీఆర్ ఒక తాగుబోతు సమూహంగా మార్చి, బెల్టు షాపులతో మత్తులో ముంచారు. తెలివిగల ప్రజలు అప్రమత్తమై కాంగ్రెస్ ను గెలిపించారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తే.. జైల్లో పెట్టిస్తాం' అని హెచ్చరించారు.