ఏపీలో రహదారుల నిర్వహణపై సీఎం చంద్రబాబు వినూత్న ఆలోచన చేసినట్టు తెలిసింది. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి రహదారుల నిర్వహణ అప్పగించే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఉభయ గోదావరి జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసే యోచనలో ఉన్నారు. దీంతో జాతీయ రహదారుల తరహాలో గోదావరి జిల్లాల్లోని రోడ్ల నిర్వహణ చేపట్టనున్నారు. తర్వాత ఇతర జిల్లాల్లో ఈ ప్రక్రియను అమలు చేయనున్నారు.