Oct 17, 2024, 10:10 IST/చొప్పదండి
చొప్పదండి
చొప్పదండి: సాయిబాబా ఆలయంలో అన్న ప్రసాద వితరణ
Oct 17, 2024, 10:10 IST
చొప్పదండి సాయిబాబా ఆలయంలో గురువారం పౌర్ణమి సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 6 గంటలకు అభిషేకం, 12 గంటలకు మధ్యాహ్న హారతి అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రతి పౌర్ణమి నాడు అన్నప్రసాద కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఆలయ కమిటీ చైర్మన్ హనుమంత రెడ్డి, సభ్యులు దండే లింగన్న, దూస రాము, కటకం మహేష్, అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.