విద్యుత్ షాక్ తగిలి ఆవు మృతి
చిత్తూరు జిల్లా కార్వేటినగరం హరిజనవాడలో శనివారం కరెంట్ షాక్ తగిలి ఓ పాడి ఆవు మృతి చెందింది. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ కింద ఉండటంతో ఆవు వెళ్లి తాకింది. దీంతో కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే ఆవు మృతి చెందింది. అధికారులకు పలుమార్లు విన్నవించనా పట్టించోలేదని స్థానికులు వాపోయారు. దీనిపై ఉన్నత అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరారు.