Mar 31, 2025, 12:03 IST/
రంజాన్ రోజు విషాదం.. తండ్రి, కొడుకు మృతి
Mar 31, 2025, 12:03 IST
TG: ఖమ్మం జిల్లా అల్లపాడులో రంజాన్ పండుగ రోజు తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు చెరువులో మునిగి తండ్రి యూసుఫ్ ఖాన్, కుమారుడు కరీముల్లా ఖాన్ మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.