నాగలాపురం: దుర్గా దేవిగా మరగదాంబిక
నాగలాపురం మండలం సురుటుపల్లి పళ్లికొండేశ్వర స్వామివారి ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 6వ రోజు మంగళవారం శ్రీ దుర్గ అలంకారంలో మరగదాంబిక అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో లత, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.