నారాయణవనం: మద్యం దుకాణాలు దక్కించుకుంది వీరే
తిరుపతి శిల్పారామంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో నారాయణవనం మండలంలో మూడు మద్యం దుకాణాలను డిప్ ద్వారా ఎంపిక చేశారు. నారాయణవనం మండలంలో 7 వ షాపును యన్ భరత్ కుమార్ , 17 వ షాపును డీ. షణ్ముఖ సుందరం 3వ షాపును జి. ధర్మయ్య దక్కించుకున్నట్లు ప్రకటించారు. వీరు ఈనెల 16వ తేదీ నుంచి నూతన మద్యం దుకాణాలను నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు.