నారాయణవనం మండలంలోని ప్రజలకు మంచినీరు అందించడానికి ఆర్ డబ్ల్యుఎస్ అధికారులు స్థానిక సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో మంచినీటి బోరు వేశారు. అక్కడ నుంచి పైప్ లైన్ ద్వారా మంచినీటిని నారాయణవనంకు సరఫరా చేస్తారు. కొద్ది రోజుల క్రితం పైప్ లైన్ పగిలిపోవడంతో మంచినీరు అంతా వృధాగా పారుతోంది. జాతీయ రహదారిపైనే ఈ మంచినీరు వృధాగా పోతున్నా ఎవరూ పట్టించుకోక పోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక నైనా సంబంధించిన అధికారులు స్పందించి పైప్ లైన్ కు మరమ్మత్తులు చేయించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.