Oct 25, 2024, 04:10 IST/
తీరం దాటిన ‘దానా’ తుఫాను.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
Oct 25, 2024, 04:10 IST
బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుఫాను తీరం దాటింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. ముఖ్యంగా తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలపై తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. మరోవైపు ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో మూడ్రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది.