షర్మిలకు వచ్చిన వారసత్వ ఆస్తి ఎంతంటే?: పేర్ని నాని

77చూసినవారు
షర్మిలకు వచ్చిన వారసత్వ ఆస్తి ఎంతంటే?: పేర్ని నాని
వైఎస్ షర్మిలకు తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తుల వివరాలను వైసీపీ నేత పేర్ని నాని వివరించారు. ‘వైఎస్ మరణానికి ముందే షర్మిలకు బంజరాహిల్స్ రోడ్ నం.2లో 280 గజాల స్థలం, ఇడుపులపాయలో 51 ఎకరాల పొలం, 15 మెగావాట్ల సండూర్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్, 22.5 మెగావాట్ల స్వాతి హైడ్రో పవర్ ప్రాజెక్టులో వాటా, విజయవాడ రాజ్-యువరాజ్ థియేటర్‌లో 35 శాతం వాటా, పులివెందులలో మరో 7.6 ఎకరాల భూమి, విజయలక్ష్మి మినరల్స్ ట్రేడింగ్ కంపెనీలో వంద శాతం వాటా.’ అని పేర్ని నాని అన్నారు.

సంబంధిత పోస్ట్