Mar 10, 2025, 02:03 IST/వేములవాడ
వేములవాడ
రాజన్న సేవలో మంత్రి పొన్నం
Mar 10, 2025, 02:03 IST
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారిని మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ. ఆ దేవదేవుల్లా కరుణ కృప కటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి స్వామివారి ఆశీస్సులు అందించి ఆలయ అభివృద్ధితోపాటు ప్రజలకు మరింత మంచి పాలన అందించేందుకు శక్తినివ్వాలని వేడుకున్నట్లు పేర్కొన్నారు.