AP: వైసీపీకి మరో షాకిచ్చేందుకు కూటమి భారీ స్కెచ్ వేస్తోంది. గ్రేటర్ విశాఖ మేయర్ పీఠంపై కూటమి కన్నేసింది. రాష్ట్రంలో అతి పెద్ద కార్పొరేషన్‌గా ఉన్న విశాఖ మేయర్ సీటును తమ ఖాతాలో వేసుకునేందుకు కూటమి నేతలు ఎత్తులు వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలను కూటమి ఛేజిక్కించుకుంది. ఇప్పుడు మేయర్ పీఠం వంతు వచ్చింది. టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాస్ మేయర్ రేసులో ఉన్నారు. డిప్యూటీ మేయర్ స్థానానికి జనసేన నుంచి ఇద్దరు కార్పొరేటర్లు పోటీ పడుతున్నట్లు సమాచారం.