వన్డేలకు రిటైర్మెంట్ చేస్తున్నారని జరుగుతున్న ప్రచారంపై టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. తాను వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలకడం లేదని స్పష్టం చేశారు. తన కెరీర్‌పై ఎలాంటి అసత్య ప్రచారం చేయవద్దని కోరారు. కాగా, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ వన్డేలకు వీడ్కోలు చెబుతారని నెట్టింట ప్రచారం జరిగింది. మరోవైపు రోహిత్ శర్మ 2027 వన్డే వరల్డ్ కప్ వరకు ఆడాలని ఆయన అభిమానులు కోరుతున్నారు.