రోడ్డుపై ప్రవహిస్తున్న పాముల కాలువ
వరదయ్య పాలెం మండలం గోవర్ధనపురంలో బుధవారం పాముల కాలువ రోడ్డుపై నుంచి ప్రవహిస్తోంది. ఈ సందర్భంగా మెయిన్ రోడ్డుపై చెత్తాచెదారం అంతా చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని స్థానికులు తెలిపారు. పంచాయతీ అధికారుల స్పందించి జేసీబీ ద్వారా చెత్తను తొలగించవలసిందిగా కోరుతున్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, వాగుల్లో నీరు భారీగా చేరింది.