సమస్యలను నా దృష్టికి తీసుకురండి: ఎమ్మెల్యే

67చూసినవారు
చిత్తూరు జిల్లా వడమాలపేట మండలంలోని ఓబీఆర్ కండ్రిగలో శనివారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఓ మహిళ స్మశానం దారి సమస్య ఉందని చెప్పగా వెంటనే సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారికి ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్