AP: సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు సొంతూరు తిరుపతి జిల్లా నారావారిపల్లిలో భోగి సంబరాల్లో పాల్గొన్నారు. విద్యార్థులు, మహిళలకు ఆటలు, ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ ఆటల పోటీల్లో సీఎం చంద్రబాబు మనవడు దేవాన్ష్ పాల్గొన్నారు. ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలకు రూ.10,116 ఇంటికి పంపిస్తానని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు.