కాకరకాయ తినడానికి చేదుగా ఉన్నా.. దీనిలో అనేక పోషకాలు కలిగి ఉంటాయి. కాకర తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం నుంచి రోగనిరోధక శక్తిని పెంచడం వరకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. కాకరకాయలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి వాపును తగ్గించడానికి సహాయపడతాయి. డయాబెటిస్ ఉన్నవారికి కాకర ఒక అద్భుత వరమనే చెప్పాలి. కాకరలో ఉండే ఫైబర్ కంటెంట్ కడుపు నిండుగా ఉండేలా చేసి ఆకలిని తగ్గిస్తుంది.