ఏపీలోని అన్ని జిల్లా కేంద్రాల్లోని బీసీ స్టడీ సర్కిళ్లలో శనివారం నుంచి డీఎస్సీకి ఉచిత శిక్షణ ప్రారంభిస్తున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. శిక్షణ సమయంలో అభ్యర్థులకు నెలకు రూ.1,500 స్టైఫండ్, మెటిరీయల్ కోసం రూ.1,000 ఇస్తామన్నారు. కాగా, ప్రభుత్వం 5,200 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, 520 మంది ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వనుంది.