202 మందికి నేడు ఉగాది పురస్కారాలు

81చూసినవారు
202 మందికి నేడు ఉగాది పురస్కారాలు
AP: శ్రీవిశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా ఆదివారం 202 మందికి సీఎం చంద్రబాబు పురస్కారాలు అందజేయనున్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పురస్కార కార్యక్రమం జరగనుంది. పలు రంగాల్లో చేసిన కృషిని గుర్తిస్తూ కళారత్న అవార్డులకు 86 మందిని, ఉగాది పురస్కారాలకు 116 మందిని ప్రభుత్వం ఎంపిక చేసింది. కళారత్న అవార్డు గ్రహీతలకు రూ.50 వేల నగదు, ఉగాది పురస్కార గ్రహీతలకు రూ.10 వేలు, మెమెంటో అందిస్తారు.

సంబంధిత పోస్ట్