AP: రాష్ట్ర ప్రజలకు చల్లటి కబురు. ఏప్రిల్ 3 తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం అల్పపీడనం వాయుగుండంగా మారనుందని, దక్షిణ కోస్తా (ఏపీ), ఉత్తర తమిళనాడు తీరాల వైపు పయనిస్తుందని భావిస్తోంది. అల్పపీడనం ఏర్పడే వరకు దీని ప్రభావం గురించి కచ్చితంగా చెప్పలేమని పేర్కొంది. సోమ, మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంది.