AP: రాష్ట్రవ్యాప్తంగా 51 మండలాల్లో కరవు పరిస్థితులు ఉన్నాయని విపత్తు నిర్వహణ సంస్థ గుర్తించింది. 6 జిల్లాల్లోని 37 మండలాల్లో తీవ్ర, 14 మండలాల్లో మధ్యస్థంగా కరవు పరిస్థితులు ఉన్నాయని తేల్చింది. ప్రకాశంలో 17, కర్నూలులో 10, నంద్యాలలో 5, అనంతపురంలో 7, వైఎస్సార్ కడపలో 10, సత్యసాయిలో 2 మండలాల్లో కరవు పరిస్థితులు ఉన్నాయంది. రబీలో క్షేత్రస్థాయి వివిధ అంశాల ఆధారంగా పరిస్థితులు అంచనా వేసి, ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.