TG: పండుగ వేళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు బైపాస్ హైదరాబాద్-బెంగుళూరు జాతీయ రహదారిపై కడప జిల్లా బద్వేల్ నుంచి HYD వెళ్తున్న ప్రైవేటు వోల్వో బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తోపాటు పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.