
ఐపీఎల్ సీజన్.. బెంగుళూరు, గోవా నుంచి బెట్టింగ్
ఐపీఎల్ సీజన్ అంటే బెట్టింగ్ షురూ అంటారు. ఈ క్రికెట్ ప్రారంభం కావడమే ఆలస్యం బుకీలు స్టార్ట్ అయిపోతాయి. విజయవాడలోని అయోధ్యనగర్, బావాజీపేట, చిట్టినగర్, కొత్తపేట, సత్యనారాయణపురం తదితర ప్రాంతాలకు చెందిన ప్రధాన బుకీలపై పోలీసుల నిఘా ఉండడంతో ఇప్పుడు బెంగుళూరు, గోవా నుంచి బెట్టింగ్ స్టార్ట్ చేశారు. విజయవాడ నలుమూలల సబ్ బుకీలతో బెట్టింగ్ నిర్వాహణకు ఏర్పాట్లు చేశారు.