AP: కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. కోడుమూరు ఎస్సీ హాస్టల్‌లో మహేశ్ అనే విద్యార్థి ఏడో తరగతి చదువుతున్న విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టాడు. కింద పడేసి బెల్టుతో కొడుతూ.. కాలితో తన్నాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. అధికారులు హాస్టల్‌కు చేరుకుని వివరాలు సేకరించారు. దాడి చేయడానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు.