అమలాపురం: మార్చి 31లోపు గ్యాస్ సిలిండర్ పొందవచ్చు
కోనసీమలోని ప్రజలందరూ దీపం పథకం ద్వారా 2025 మార్చి 31లోపు ఎప్పుడైనా ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందవచ్చు అని జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి తెలిపారు. ఆమె అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద గురువారం మీడియాతో మాట్లాడారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పొందే క్రమంలో లబ్ధిదారులందరూ ఆధార్ కార్డుతో గ్యాస్ బుకింగ్ వివరాలను ఈకేవైసీ చేయించుకోవలసి ఉంటుందని తెలిపారు.