అమలాపురం: మండల స్థాయి సమస్యలకు పరిష్కారం చూపాలి: కలెక్టర్
మండల స్థాయి ప్రజా సమస్యలకు మండల స్థాయిలోనే అధికారులు పరిష్కారం చూపాలని కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆయన అమలాపురంలోని కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం నిర్వహించిన పిజిఆర్ఎస్ కార్యక్రమం నిర్వహణను పరిశీలించారు. ఈ కార్యక్రమానికి సోమవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు వారి సమస్యలను తెలియజేసి 165 ఫిర్యాదులను అందించారని కలెక్టర్ తెలిపారు.