మామిడికుదురు: గ్రామ సభలో 50 పనులకు ప్రతిపాదనలు

76చూసినవారు
గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 50 పనులు చేపట్టేందుకు ప్రజల నుంచి ప్రతిపాదనలు తీసుకున్నారు. మామిడికుదురు గ్రామ పంచాయతీ వద్ద గురువారం ఉపాధి హామీ గ్రామసభ జరిగింది. ఏపీవో రమేశ్ బాబు అధ్యక్షతన జరిగిన సభలో సుమారు రూ. 45 లక్షలతో పంట కాలువల ఆధునికీకరణ, మురుగు కాలువల అభివృద్ధి, కొబ్బరి చెట్ల చుట్టూ పళ్ళాలు తవ్వకం తదితర పనులకు సంబంధించిన ప్రతిపాదనలు స్వీకరించారు. సభలో పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you