తూ. గో జిల్లాలో ఉన్న 125 మద్యం దుకాణాలకు గురువారం సాయంత్రానికి 3, 312 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సూపరింటెండెంట్ చింతాడ లావణ్య గురువారం తెలిపారు. దరఖాస్తులను శుక్రవారం రాత్రి 7 గంటలలోపు అందజేయాలని సూచించారు. కాగా 14వ తేదీ ఉదయం 8 గంటలకు రాజమండ్రి ఆనం కళాకేంద్రంలో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా మద్యం దుకాణాలకు డ్రా తీయనున్నట్టు వెల్లడించారు.